05/11/2026, Thursday · 09:02:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నేను ట్రావెల్ ఏజెంట్‌ కాదు.. రాహుల్ వియత్నాం పర్యటనపై శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 2:25 PM జాతీయం 4

నేను ట్రావెల్ ఏజెంట్‌ కాదు.. రాహుల్ వియత్నాం పర్యటనపై శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Want this news as a newspaper clip?Print News Clip

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్న వేళ రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లారంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఈ సందర్భంగా శశి థరూర్ మాట్లాడుతూ.. 'నేను ట్రావెల్ ఏజెంట్‌ కాదు. ఈ ప్రశ్న నన్ను అడగడంలో అర్థం లేదు. నేనిప్పుడు ఢిల్లీని వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రతి ఒక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందువల్ల ఈ విషయంపై నేను వ్యాఖ్యానించలేను' అని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఆయన కేరళంలోని తిరువనంతపురంలో పర్యటిస్తున్నారు.

రాహుల్ పర్యటనపై బీజేపీ విమర్శలు

ఢిల్లీలో ఇటీవల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఆ సమయంలో రాహుల్ విదేశాలకు వెళ్లారంటూ బీజేపీ ఓ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. అందులో కాంగ్రెస్ అగ్రనేత విమానంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. రాజకీయ కార్యక్రమాల కంటే విదేశీ పర్యటనలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించింది. బీజేపీ నేత సంబిత్ పాత్రా తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్‌కు జార్జ్ సోరోస్‌తో సంబంధాలు ఉన్నాయని, భారతదేశంలో ప్రభుత్వ మార్పునకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఆయన విదేశాలకు వెళ్లారని పాత్రా పేర్కొన్నారు.

బీజేపీ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై బీజేపీ విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత బాధ్యతలు, కార్యక్రమాలు ఉంటాయని.. రాహుల్ పర్యటనను రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఒక వ్యక్తి మాత్రమే కాకుండా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విదేశాల్లోని యేల్ విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశాలు, లండన్‌లో విద్యార్థులు, మేధావులతో చర్చలు వంటి కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

shashi tharurnenutravelejemtkadurahulviyatnamparyatanapai

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News