05/11/2026, Thursday · 09:02:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పారా ఆసియా క్రీడలు-2026: శీతల్ జోడీకి స్వర్ణం..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 12:59 PM జాతీయం 5

పారా ఆసియా క్రీడలు-2026: శీతల్ జోడీకి స్వర్ణం..
Want this news as a newspaper clip?Print News Clip

పారా ఆసియా క్రీడలు-2026లో నాలుగో రోజూ కూడా భారత్‌ అథ్లెటిక్స్ అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నారు.  ఇప్పటికే రెండు స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. దీంతో 16 స్వర్ణాలు, 22 రజతాలు, 33 కాంస్యాలు కలిపి 71 పతకాలతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇదే టోర్నీలో మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన శీతల్ దేవి.. మిక్స్‌డ్ డబుల్స్‌లో తోమన్‌ కుమార్‌తో కలిసి పసిడిని పట్టింది. తుదిపోరులో శీతల్ జోడీ(భారత్) 151-148 తేడాతో ఇండోనేషియాను ఓడించింది.పారా ఆసియా క్రీడల్లో పోటీ పడిన తొలి భారత డబ్ల్యూ1 ఆర్చర్‌‌గా స్వాతి చౌదరి నిలిచింది. తీవ్రమైన శారీరక వైకల్యాలు ఉన్న వీల్‌ఛైర్‌ ఆర్చరీ విభాగాన్ని డబ్ల్యూ-1 అని పిలుస్తారు. ఈ విభాగంలో వీల్‌ఛైర్‌లో కూర్చొని పోటీపడతారు. డబ్ల్యూ-1 ఆర్చర్ లో స్వాతి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. తుది పోరులో మొదటి సెట్‌ను గెలుచుకున్న ఆమె.. ఆ తర్వాత లయను కోల్పోయింది. చివరికి 4-6 తేడాతో ఓడి.. రజతం సాధించింది.

మరోవైపు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్-3 విభాగంలో సంజనా కుమారి కాంస్యంతో సరిపెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-4 కేటగిరీలో అభిజీత్, సుహాస్‌ యతిరాజ్‌లు కూడా కాంస్యాలను గెలిచారు. అలానే మిక్స్‌డ్ డబుల్స్‌ ఎస్‌హెచ్‌-6 విభాగంలో కృష్ణ నాగర్ - నిత్య శ్రీ జోడీ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియాకు చెందిన రినా మార్లినా - సుభన్‌ 14-21, 18-21 తేడాతో భారత జోడీపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌-3 కేటగిరీలో మనీషా రామ్‌దాస్ - ప్రమోద్‌ భగత్‌కూ కాంస్యమే వచ్చింది. మొత్తంగా బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ కాంస్యాలతో సరిపెట్టుకుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Asian GamesParaGoldCheetalJodi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News