05/11/2026, Thursday · 09:02:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

నిరసనలను వాయిదా వేయండి.. రాహుల్ గాంధీకి ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 3:51 PM జాతీయం 4

నిరసనలను వాయిదా వేయండి.. రాహుల్ గాంధీకి ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి
Want this news as a newspaper clip?Print News Clip

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి తలపెట్టనున్న నిరసన కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరుతూ ఢిల్లీ వ్యాపారులు.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. పండగ సీజన్‌లో ఈ ఆందోళనలు నిర్వహించడం వల్ల తమకు అక్షరాలా పది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపారుల తరఫున ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ).. నిరసనలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది.భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి పండగ సమీపిస్తున్న వేళ.. ఈ నిరసనలు వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని సీటీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీపావళి షాపింగ్ కోసం ప్రజలు దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వస్తారని, ఇక్కడ రూ.25 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని చెబుతోంది. అయితే పండగ సీజన్‌లో ఇలాంటి కార్యక్రమాల కారణంగా తమకు రూ.10,000 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆవేదన చెందుతోంది. ఇప్పటికే అక్టోబర్‌లో జరిగిన నిరసనల వల్ల వ్యాపారులకు రూ.3000 కోట్ల మేర నష్టాలు వచ్చాయని వాపోయింది. అందుకే సీఈసీ వ్యతిరేక ర్యాలీని వాయిదా వేయాలని వర్తక సంఘం కోరింది.నవంబర్ 1న నిరసనలు నిర్వహిస్తే రామ్‌లీలా మైదానం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లు, మెట్రో స్టేషన్ల మూసివేత వంటి చర్యలు ఉంటాయని, ఇవి వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. అందుకే ఈ కార్యక్రమాలను నవంబర్ 10 తరువాత చేపట్టాలని రాహుల్ గాంధీని కోరారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

merchants appealPostponeprotestsDelhiRahulGandhi

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News