05/11/2026, Thursday · 09:02:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కోలుకున్న తల్లి.. మొక్కు తీర్చేందుకు తనయుడి పరుగులు

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 4:12 PM జాతీయం 4

కోలుకున్న తల్లి.. మొక్కు తీర్చేందుకు తనయుడి పరుగులు
Want this news as a newspaper clip?Print News Clip

తల్లే ప్రపంచంగా బతుకుతున్న ఓ టీనేజర్ ఆమె అనారోగ్యం బారినపడటంతో భయపడిపోయాడు. ఆ భయంలోనే అతడు ఎవ్వరూ ఊహించని మొక్కు మొక్కుకున్నాడు. తల్లి మళ్లీ కోలుకోవడంతో అతడి సంతోషానికి అంతే లేకుండా పోయింది. మాట ప్రకారం మొక్కు చెల్లించేందుకు సిద్ధమైన అతడు దేశవ్యాప్తంగా పరుగులు తీయడం ప్రారంభించాడు. ఇప్పటివరకూ 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించాడు.మొక్కు చెల్లించేందుకు ఇలా పరుగులు పెడుతున్న ఆ టీనేజర్ పేరు మోనూ మేతుర్‌బాలా. వయసు 19 ఏళ్లు. బిహార్‌లోని ఆరియా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం క్రితం మోనూ తల్లి లాల్తీ దేవీ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. గొంతులో చేపముల్లు దిగడంతో ఆమె ఆరోగ్యం క్షిణించసాగింది. ఎన్ని ఆసుపత్రల్లు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, భయపడిపోయిన మోనూ భగవంతుడిని ప్రార్థించాడు. తల్లి కోలుకున్నాక తాను పరుగులు తీస్తూ ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించుకుంటానని మొక్కుకున్నాడు. దేవుడు కరుణించడంతో అతడి తల్లి గండం నుంచి గట్టెక్కింది. దీంతో, మోనూ సంబరపడిపోతూ మొక్కు చెల్లించుకునేందుకు ఈ ఏడాడి మార్చ్ 15న పట్నా నుంచి బయలుదేరాడు.మోనూ ఇప్పటివరకూ 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించాడు. పరుగులు తీస్తూనే ఆరు జ్యోతిర్లింగాలను సందర్శించుకున్నాడు. రోజుకు 50 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంటాడు. మోనూకు మద్దతుగా మరో ఇద్దరు వ్యక్తులు అతడి వెంటే ప్రయాణిస్తున్నారు. తన కోసం తనయుడు పడుతున్న తపన చూసి అతడి తల్లి మురిసిపోయారు. కొడుకు ప్రయాణం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

her sonRecoveredmotherrunsnipple

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News