05/11/2026, Thursday · 09:02:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

వర్కౌట్లు చేయకపోతే రోహిత్ శర్మ కెరీర్‌కే ముప్పు: భారత మాజీ కోచ్

భవ్య జర్నలిస్ట్ 26/10/2026 12:51 PM జాతీయం 6

వర్కౌట్లు చేయకపోతే రోహిత్ శర్మ కెరీర్‌కే ముప్పు: భారత మాజీ కోచ్
Want this news as a newspaper clip?Print News Clip

భారత స్టార్ ప్లేయర్ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై మాజీ స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2017లో రోహిత్‌ కెరీర్‌కే ముప్పుగా మారే స్థాయిలో తుంటి భాగంలో గాయం ఎదుర్కొన్నాడని వెల్లడించాడు. అప్పటి నుంచి అతడి ఫిట్‌నెస్‌ను కాపాడేందుకు ప్రత్యేక శిక్షణ అవసరమని తెలిపాడు. వారానికి కనీసం రెండు స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ సెషన్లు చేయకపోతే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాడు. అందుకే రోహిత్‌ శిక్షణ విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశాడు.‘రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై సోషల్‌ మీడియాలో తరచూ విమర్శలు వస్తుంటాయి. అతడు బరువు ఎక్కువగా ఉన్నాడని, శిక్షణపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదని వ్యాఖ్యానిస్తుంటారు. అయితే రోహిత్‌ వెనుక ఉన్న కష్టాన్ని, అతడు ఎదుర్కొన్న గాయాల చరిత్రను గుర్తించకుండా విమర్శలు చేయడం సరికాదు. 2017లో ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిపోయిన తర్వాత రోహిత్‌ తీవ్రమైన గాయంతో ఇబ్బంది పడ్డాడు. తుంటి భాగంలో తగిలిన గాయం అతడి కెరీర్‌కు ప్రమాదకరంగా మారింది. రోహిత్‌ వారానికి కనీసం రెండు స్ట్రెంత్‌ సెషన్లు చేయకపోతే అది ప్రమాదానికి సంకేతం. గత ఏడెనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి. ఆ గాయాన్ని దాటి ఎంతో కష్టపడితేనే ఇంతకాలం క్రికెట్‌లో కొనసాగగలుగుతున్నాడు. పరుగులు చేయడం, ఐపీఎల్‌లో నాయకత్వం వహించడం, ఏడాది పొడవునా మూడు ఫార్మాట్లలో ఆడటం సాధ్యమయ్యేది కాదు’ అని సోహమ్‌ వివరించాడు.

కోహ్లీతో పోలిస్తే రోహిత్‌ శిక్షణ భిన్నం

‘రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ శిక్షణా విధానాలు వేర్వేరుగా ఉంటాయి. రోహిత్‌ శిక్షణలో బలాన్ని పెంచే వ్యాయామాలు, వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనలకు ప్రాధాన్యం ఉంటుంది. హ్యామ్‌స్ట్రింగ్‌, తొడ కండరాలు తదితర భాగాలు సరైన స్థితిలో ఉండేందుకు ప్రాథమిక రన్నింగ్‌ వ్యాయామాలు కూడా అవసరం. విరాట్‌ కోహ్లీ విషయంలో మాత్రం మైదానంలో చేసే శారీరక శ్రమకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జిమ్‌లో బరువులతో చేసే వ్యాయామాలు, ప్రాథమిక స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ అతడి సాధనలో భాగం. ఇద్దరి అవసరాలు వేర్వేరు కాబట్టి ఒకరి శిక్షణ విధానాన్ని మరొకరితో పోల్చలేం. టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మ ప్రణాళిక ప్రకారం శిక్షణ తీసుకుంటున్నాడు. కసరత్తులు చేయడానికి ఎక్కువ సమయం లభిస్తోంది’ అని సోహమ్ వివరించాడు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

India CoachRohitSharmaCareerThreatenedWorkedOutFormer

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News