05/11/2026, Thursday · 08:34:47 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 3:45 PM జాతీయం 16

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి
Want this news as a newspaper clip?Print News Clip

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి నేపథ్యంలో న్యూఢిల్లీలో పర్యావరణ హిత గ్రీన్ క్రాకర్స్‌ను కాల్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా అనుమతించింది. నవంబర్ 7, నవంబర్ 8 తేదీల్లో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తూ జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆ రెండు రోజుల్లో ఉదయం 6 - 7 గంటల మధ్య, మళ్లీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే ఈ టపాసులను కాల్చేందుకు అనుమతిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.ఈ అంశంపై గతవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు నిరాకరించింది. నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పదే పదే మార్గదర్శకాలు జారీ చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదని, హాస్యాస్పందంగా మారుతుందని పేర్కొంది. ‘ప్రజల సెంటీమెంట్స్‌ను అర్థం చేసుకున్నాము. పూర్తిస్థాయి నిషేధం విధించలేము. కానీ ఆ స్థాయి కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి సృష్టించవద్దు’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీకి కోర్టు స్పష్టం చేసింది.

టపాసుల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. టపాసుల విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రిటీల సాయం తీసుకోవాలని కూడా సూచించింది. టపాసుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం, తలెత్తే అనారోగ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

suprimkortu anumatidhillilogrinkrakarskalchemduku

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News