05/11/2026, Thursday · 09:02:28 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తమిళనాడులో ఖైదీల పరారీపై స్టాలిన్ విమర్శలు

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 1:31 PM జాతీయం 10

తమిళనాడులో ఖైదీల పరారీపై స్టాలిన్ విమర్శలు
Want this news as a newspaper clip?Print News Clip

తమిళనాడులో జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్న ఘటనలపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో అధికార టీవీకే పార్టీని ‘బ్రేకింగ్ బ్యాడ్ పార్టీ’ గా ఆయన అభివర్ణించారు. జైలు నుంచి ఖైదీలు పరారవుతున్న ఘటనల నేపథ్యంలో ‘బ్రేకింగ్ బ్యాడ్’ తర్వాత ఇప్పుడు తమిళనాడులో ‘ప్రిజన్ బ్రేక్’ (జైళ్ల నుంచి ఖైదీలు పారిపోవడం) మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.కాగా.. తేని జిల్లాలోని తెక్కడంపట్టి సబ్‌ జైలు నుంచి సోమవారం 17 మంది విచారణ ఖైదీలు పరారయ్యారు. దీనికి కొద్ది రోజుల ముందే చెన్నై శివార్లలోని పుళల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకుని పోయారు. ఈ ఘటనలపై మంగళవారం స్టాలిన్ స్పందించారు. బెయిల్‌పై విడుదలైన వారిపైనే నిఘా లేదనుకున్నానని, ఇప్పుడు జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా తప్పించుకునే పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. 1995 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఖైదీలు పరారవడం ఇదే మొదటిదని పేర్కొన్నారు. విజయ్ ప్రభుత్వంపై ఏమీ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. కాగా.. తమిళనాడు హోం శాఖ ముఖ్యమంత్రి విజయ్ పరిధిలో ఉంది.

తప్పించుకున్న ఖైదీలు విజయ్ ఫ్యాన్సా?

మరో డీఎంకే నేత ఇళంగోవన్ కూడా విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జైళ్ల నుంచి తప్పించుకున్న ఖైదీలు సీఎం విజయ్ అభిమానులా అని ప్రశ్నించారు. ‘పారిపోయిన వారు ఎవరో మనం చెక్ చేయాలి. తప్పించుకున్న ఖైదీలు విజయ్ ఫ్యాన్సా లేక టీవీకేకు చెందిన వారా అన్నది తేల్చాలి’ అని ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. ఖైదీల పరారీపై అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి కూడా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పుళల్ జైలు నుంచి ఖైదీలు పారిపోయిన తర్వాత ప్రభుత్వం అలాగే నిర్లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

stalin vimarshalutamilanadulokhaidilapararipai

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News