05/11/2026, Thursday · 08:34:43 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఇండియా కూటమి మాక్ పార్లమెంట్.. సీఈసీపై ఆరు ప్రధాన అభియోగాలు ఇవే..

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 8:19 PM జాతీయం 19

ఇండియా కూటమి మాక్ పార్లమెంట్.. సీఈసీపై ఆరు ప్రధాన అభియోగాలు ఇవే..
Want this news as a newspaper clip?Print News Clip

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆరు తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల కమిషన్ పాత్ర, దాని స్వతంత్రత, ఓటర్ల హక్కుల పరిరక్షణ, సర్‌పై ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈరోజు (శనివారం) ఇండియా కూటమి నేతలు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో సీఈసీకి వ్యతిరేకంగా జన మహాభియోగాన్ని(పబ్లిక్ ఇంపీచ్‌మెంట్) ఖర్గే ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా, జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాలు మోపిన ఆరు ప్రధాన అభియోగాలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

 జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు ఇవే..!

  1. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసి, అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారనేది ఇండియా కూటమి ప్రధాన ఆరోపణ. ఎన్నికల స్వేచ్ఛ, పారదర్శకత దెబ్బతినేలా కుట్ర జరిగిందని ఆరోపించింది.
  2. ఆరు ఆరోపణల్లో ఈ అంశం అత్యంత కీలకమైనది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో సుమారు 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
  3. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో పార్లమెంట్‌కు తెలియకుండా, దాని పర్యవేక్షణ లేకుండా మార్పులు చేశారనేది మూడో ఆరోపణ. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నిబంధనలను పారదర్శకత లేకుండా మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
  4. ఎన్నికల సంఘం డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ఈసీఐఎన్ఈటీ (ECINET) ద్వారా ఓటర్ల జాబితాలపై నియంత్రణ సాధించారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ఓటర్ల వివరాల నిర్వహణ, వాటిపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పారదర్శకత లోపించిందని అభ్యంతరం వ్యక్తం చేసింది.
  5. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మిగిలిన ఇద్దరు కమిషనర్లను పక్కన పెట్టి, ఏకపక్షంగా వ్యవహరించారనేది ఐదో అభియోగం.
  6. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆరోపణ ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని అభియోగాలు మోపింది.
  7. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. తమకు జ్ఞానేశ్ కుమార్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన వారి పేర్లు తొలగిపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇండియా కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్‌పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది నిజమైన పార్లమెంట్ కాదని, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ నాటకమని విమర్శించింది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Mac ParliamentsixmainchargesCECIndiaCoalition

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News