05/11/2026, Thursday · 08:34:38 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పంజాబ్‌లో ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు!

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 1:31 PM జాతీయం 16

పంజాబ్‌లో ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు!
Want this news as a newspaper clip?Print News Clip

 పంజాబ్ శాసనసభ ఎన్నికలకు(2027) ముందు అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆప్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ (అమృత్‌సర్ నార్త్), హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా (సనౌర్), చేతన్ సింగ్ జోరామజ్రా (సమానా) న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భారతీయా జనతా పార్టీ (BJP)లో చేరారు.పంజాబ్‌లో తన ప్రాతినిధ్యం, రాజకీయ ప్రభావాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీకి ఈ పరిణామం పెద్ద ఊతాన్ని ఇచ్చింది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన పంజాబ్ అసెంబ్లీ సభ్యత్వానికి, ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్‌కు తన రాజీనామా లేఖను పంపి, ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పటియాలా జిల్లాకు చెందిన హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా (సనౌర్) చేతన్ సింగ్ జోరామజ్రా (సమానా) ఇద్దరూ అంతకుముందే ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేతన్ సింగ్ జోరామజ్రా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (SAD) అభ్యర్థి సుర్జీత్ సింగ్ రఖ్రాపై 39,713 ఓట్ల మెజారిటీతో సమానా స్థానాన్ని గెలుచుకున్నారు. హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా.. సనౌర్ స్థానంలో SAD అభ్యర్థి హరీందర్ పాల్ సింగ్ చందుమజ్రాను 49,122 ఓట్ల తేడాతో ఓడించారు. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్.. అమృత్‌సర్ నార్త్ నియోజకవర్గంలో SAD అభ్యర్థి అనిల్ జోషిపై 28,318 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇక, 2027 పంజాబ్ ఎన్నికల నిమిత్తం ఆప్ ఇటీవల 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (ధూరీ నియోజకవర్గం) తో పాటు స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ (కోట్‌కాపురా), కుల్దీప్ సింగ్ ధాలివాల్ (అజ్నాలా), బల్జిందర్ కౌర్ (తల్వాండి సాబో) తదితరులు ఉన్నారు. అలాగే భోంద్సీ జైలులో ఉన్న పార్టీ నాయకుడు సంజీవ్ అరోరాను లూథియానా వెస్ట్ నుంచి నామినేట్ చేశారు.

పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు 2027 ప్రారంభంలో (ఫిబ్రవరి-మార్చి సమయంలో) ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లతో పాటు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2027 మార్చి 16తో ముగియనుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 92 స్థానాల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించగా, కాంగ్రెస్ 18 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. (Punjab AAP MLAs Join BJP)

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

join BJPrebelMLAsPunjab

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News