05/11/2026, Thursday · 08:34:50 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సచిన్, అంబానీ పేరు చెప్పి వృద్ధుడికి టోకరా.. రూ.2.01 కోట్ల దోపిడీ

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 9:13 PM జాతీయం 16

సచిన్, అంబానీ పేరు చెప్పి వృద్ధుడికి టోకరా.. రూ.2.01 కోట్ల దోపిడీ
Want this news as a newspaper clip?Print News Clip
  • పెట్టుబడులపై భారీ లాభాల ఆశ చూపి వృద్ధుడి నుంచి రూ.2.01 కోట్లను నిందితులు దోచుకెళ్లిన ఉదంతం పుణెలో తాజాగా వెలుగు చూసింది.

పెట్టుబడులపై భారీ లాభాల ఆశ చూపి వృద్ధుడి నుంచి రూ.2.01 కోట్లను నిందితులు దోచుకెళ్లిన ఉదంతం పుణెలో తాజాగా వెలుగు చూసింది. వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుణె సిటీ సైబర్ స్టేషన్ పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం, కొన్ని నెలల క్రితం ఆ వృద్ధుడు ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థకు సంబంధించిన యాడ్ చూశారు. ఆ సంస్థకు అంబానీ, టెండుల్కర్, మాజీ మంత్రి చిదంబరం ప్రమోటర్లుగా ఉన్నట్టు యాడ్‌లో చూసి వారికి ఫోన్ చేశారు.తమ సంస్థ బ్రిటన్‌లో ఉందని నిందితులు వృద్ధుడికి తెలిపారు. రూ.20 వేలు పెట్టుబడి పెడితే వారం తిరిగే సరికి రూ.80 వేలు వస్తుందని అన్నారు. చెప్పినట్టు డబ్బు పంపించిన వారానికి వృద్ధుడికి ఆయన అకౌంట్ స్టేట్‌మెంట్ పంపించిన నిందితులు పెట్టుబడి నాలుగింతలైనట్టు నమ్మించారు. లాభాలు వెనక్కు తీసుకుంటానని వృద్ధుడు అంటే నిందితులు వద్దని ఆయనతో క్రిప్టోకరెన్సీ, బంగారం వంటి రకరకాల పేర్లు చెప్పి విడతల వారీగా మరిన్ని పెట్టుబడులు పెట్టించారు. ఇలా రూ.1.03 కోట్లను రకరకాల అకౌంట్లకు బదిలీ చేసిన బాధితుడు మరోసారి లాభాలను వెనక్కు తీసుకునేందుకు ప్రయత్నించారు. మరో రూ.13.5 లక్షలు చెల్లించాకే డబ్బుతిరిగి తీసుకునే అవకాశం ఉందని నిందితులు చెప్పడంతో తాను మోసపోయానన్న విషయం బాధితుడికి అర్థమైంది.
దీని నుంచి తేరుకునే లోపే ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి నిందితులు వృద్ధుడిని మరోసారి బెదిరించారు. ఓ మనీలాండరింగ్ కేసులో ఆయన అకౌంట్ పేరు తెరపైకి వచ్చిందన్నారు. అకౌంట్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకూ డిజిటల్ అరెస్టు చేస్తున్నట్టు చెప్పారు. పోలీస్ క్లియరెన్స్ వచ్చే వరకూ డిజిటల్ అరెస్టు తప్పదని, ఈ విషయంలో ఎవరినీ సంప్రదించవద్దని వృద్ధుడిని హెచ్చరించారు. వెరిఫికేషన్ పూర్తయ్యే వరకూ బ్యాంక్‌లోని సొమ్మును తాము చెప్పిన అకౌంట్‌లలోకి బదిలీ చేయించుకున్నారు. ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఈడీ అధికారులు అరెస్టు చేస్తారని మళ్లీ బెదిరించారు. ఆ తరువాత డబ్బు ఇవ్వాలని వృద్ధుడు కోరడంతో వారు ఫోన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Tokara robbedcroreoldmannameSachinAmbani

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News