05/11/2026, Thursday · 09:02:31 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 4:21 PM జాతీయం 4

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Want this news as a newspaper clip?Print News Clip
  • మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2027కు సంబంధించిన షెడ్యూల్‌ రిలీజ్ అయింది. ఇవాళ(బుధవారం) ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

 క్రికెట్ ప్రియులకు అదిరిపోయ్ గుడ్ న్యూస్ ఒకటి వచ్చింది. మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ 2027కు సంబంధించిన షెడ్యూల్‌ రిలీజ్ అయింది. ఇవాళ(బుధవారం) ఐసీసీ ప్రకటించింది. 2027 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు బంగ్లాదేశ్‌, నేపాల్‌ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు 41 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.టీమిండియా జనవరి 22న వెస్టిండీస్ మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది. ఆ తర్వాత జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో తలపడనుంది. మరోవైపు జనవరి 22న పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జనవరి 24న న్యూజిలాండ్‌తో, జనవరి 26న సమోవాను ఢీకొట్టనుంది.గ్రూప్‌ దశ మ్యాచ్‌లు జనవరి 26తో ముగుస్తాయి.

అర్హత సాధించిన జట్లు సూపర్‌-6కు చేరుకుంటాయి. అక్కడి నుంచి రెండు గ్రూపుల్లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 4న చటోగ్రామ్‌లో సెమీఫైనల్స్‌ జరగనున్నాయి. సెమీఫైనల్స్‌కు ఫిబ్రవరి 5న, ఫైనల్‌కు ఫిబ్రవరి 7న రిజర్వ్‌ డే కేటాయించారు. ఫిబ్రవరి 6న తుది పోరు జరగనుంది. అలానే వచ్చే ఏడాది పురుషుల వన్డే ప్రపంచ కప్ కూడా జరగనుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా ఈ మెగా టోర్నీని నిర్వహించున్నాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Cup scheduledIndiaT20Worldheld

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News