05/11/2026, Thursday · 09:02:28 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 3:21 PM జాతీయం 4

ప్రపంచ రికార్డు.. ఫీల్డింగ్‌లో తిలక్ వర్మ సంచలనం
Want this news as a newspaper clip?Print News Clip

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. అయితే ఈ రికార్డు బ్యాటింగ్‌లో కాదు.. ఫీల్డింగ్ కావడం విశేషం. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు.మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌లను తిలక్ అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సీఫర్ట్‌ను, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మిచెల్‌ను పెవిలియన్‌కు పంపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు క్యాచ్‌లతో ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తిలక్ ఖాతాలో మొత్తం 26 క్యాచ్‌లు చేరాయి. దీంతో ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హోవే పేరిట ఉన్న 25 క్యాచ్‌ల రికార్డును తిలక్ అధిగమించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్.. ఈ వార్త రాసే సమయానికి 7 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. సంజు శాంసన్(14), వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా నిరాశపర్చారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Verma sensationWorldrecordTilakfielding

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News