05/11/2026, Thursday · 08:34:38 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కేసీఆర్, రేవంత్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు: ఎంపీ అరవింద్

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 11:53 AM నిజామాబాద్ 7

కేసీఆర్, రేవంత్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు: ఎంపీ అరవింద్
Want this news as a newspaper clip?Print News Clip

తెలంగాణలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ప్రకటించిన తర్వాతే క్రాప్ హాలిడే గురించి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ ధర్మపురి అరవింద్ పలు విమర్శలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పుల వెనుక భారీ అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలవడం ఖాయమని అరవింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గడ్డం పెంచుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా 2029 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా గల్లంతు చేస్తామని ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టిస్తుందని అన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.50 వేల ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. అవసరమైతే ఈ హామీపై బాండ్ పేపర్ రాసి ఇస్తానని అన్నారు.మరోవైపు, తెలంగాణలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్‌లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం విషయంలో త్వరలో ఆందోళన చేపడతామని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, పసుపు ధరలు, మాధవనగర్ ఆర్వోబీ అంశాలపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

protecting eachKCRRevanthArvind

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News