05/11/2026, Thursday · 08:34:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కోనసీమలో కేంద్ర బృందం పర్యటన..

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 4:08 PM పశ్చిమ గోదావరి 14

కోనసీమలో కేంద్ర బృందం పర్యటన..
Want this news as a newspaper clip?Print News Clip
  • ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఈ బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది

 ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట, ఆస్తి నష్టం అంచనాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఈ బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది. రావులపాలెం సీఆర్‌సీలో తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. అరటి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. విద్యుత్ నష్టం, రహదారులు, ఆస్తి నష్టాలను వివరించారు.తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని తెలియజేసేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని కేంద్ర బృందం సందర్శించింది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన, గల్లంతైన మత్స్యకారుల పడవలు, దెబ్బతిన్న వలలకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకుంది. ఈ బృందంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అడిషనల్ డెరైక్టర్ ప్రశాంత్ అర్మోరికర్, ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్ గార్గ్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ ప్రకర్ జైన్, విపత్తు నిర్వహణ రెవెన్యూ విభాగానికి చెందిన అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

team tourCentralKonaseema

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News