05/11/2026, Thursday · 08:34:39 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీలో వైసీపీకి భారీ షాక్..

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 5:36 PM పశ్చిమ గోదావరి 8

ఏపీలో వైసీపీకి భారీ షాక్..
Want this news as a newspaper clip?Print News Clip
  • పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. చింతపర్రు గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
  • మరోవైపు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి చెందిన 60 కుటుంబాలు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో చింతపర్రు గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. గ్రామానికి చెందిన పలువురు కీలక వైసీపీ నేతలు కూడా పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు పనితీరుపై విశ్వాసంతోనే తాము టీడీపీలో చేరినట్లు వారు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో ఆదరణ పొందుతున్నాయని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు.. కీలక నాయకులు టీడీపీలో చేరడం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆత్మకూరులోనూ 60 కుటుంబాలు జంప్..

ఆత్మకూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు.. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థులకు మంత్రి బీఫామ్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వైసీపీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Huge shockYSRCP

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News