05/11/2026, Thursday · 08:35:03 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎన్నికల్లో మారణాయుధాలను చూపి బెదిరించడం దుర్మార్గం: ఆనం

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 10:48 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 10

ఎన్నికల్లో మారణాయుధాలను చూపి బెదిరించడం దుర్మార్గం: ఆనం
Want this news as a newspaper clip?Print News Clip

కూటమి ప్రభుత్వ హయాంలో ఆత్మకూరులో రూ.117 కోట్లతో అభివృద్ది జరిగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. రూ.29 కోట్లతో సిమెంట్ రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతల మీదుగా నాలుగు లైన్ల రోడ్డును ప్రారంభించుకున్నామని తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ (MSME) పార్కుకు 30కి పైగా పరిశ్రమలు వచ్చాయని... 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు.వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ది జరగలేదని మంత్రి విమర్శించారు. ఒక్క పరిశ్రమ వస్తే, దానిని కడప జిల్లాకు తరలించుకుపోయారని మండిపడ్డారు. ఆత్మకూరులో ఏం చేశారో చూపిస్తే... తాము వచ్చి చూస్తామన్నారు. అసత్య ఆరోపణలు సరికావని.. ప్రజలు సహించబోరని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యేందుకు బొమ్మిరెడ్డి కుటుంబసభ్యులు ముందుకొచ్చారని తెలిపారు. డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ ఛైర్మన్‌గా పోటీ చేస్తున్నారని... ఆమె గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

తుపాకులు, పిస్టళ్లు, గన్స్ కొన్ని కుటుంబాలు, ప్రాంతాలకే పరిమితమని ఆనం అన్నారు. ఎన్నికల్లో మారణాయుధాలను చూపి ప్రజలని బెదిరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా రక్షణకి మా వద్ద వెపన్స్ ఉన్నాయి. అలా అని వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లం. అటువంటి చర్యలని ప్రజలు సహించరు’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

threatening weaponsShowingmassdestructionelectionsbadAnam

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News