05/11/2026, Thursday · 08:35:02 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

అనాథ బిడ్డనమ్మా

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 9:51 AM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 13

అనాథ బిడ్డనమ్మా
Want this news as a newspaper clip?Print News Clip
  • నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ‘అమ్మలారా.. అక్కలారా...’ అంటూ చేసిన వినూత్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షించింది. 35వ డివిజన్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా శివాచారి పోటీకి దిగారు.

  ఓటేసి పుణ్యం కట్టుకోండమ్మా!
నెల్లూరులో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ‘అమ్మలారా.. అక్కలారా...’ అంటూ చేసిన వినూత్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షించింది. 35వ డివిజన్‌ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా శివాచారి పోటీకి దిగారు. ఒక ఆటోను అద్దెకు తీసుకొని.. దానికి తన బ్యానర్‌ కట్టుకున్నారు. తన వాయిస్‌తో ఒక ఆడియో రికార్డు చేసి, ఆ ఆటోను డివిజన్‌లోని ప్రజల మీదకు వదిలారు. తెల్లవారుజాము 5 గంటలయితే చాలు ఆ ఆటో వీధిలోకి వచ్చి నిలబడుతుంది.
అభ్యర్థి వాయి్‌సతో రికార్డు చేసిన క్యాసెట్‌ ఆన్‌ అవుతుంది. ‘అమ్మలారా.. అక్కలారా.. అమ్మా నాన్న లేని అనాథ బిడ్డను. అందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఓటేసి పుణ్యం కట్టుకోండి. అమ్మా... అయ్యా... రాజకీయ పార్టీలు నన్ను మోసం చేశాయి. మీరు కూడా మోసం చేయవద్దు. మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అంటూ ఆ స్వతంత్ర అభ్యర్థి ప్రజలను ఓట్లు అడగడం ఆసక్తిగా మారింది. ఇలా ఆ ఆటో గత రోజులుగా వీధివీధికి పదేపదే తిరుగుతూ తమ చెవుల తుప్పును వదిలించిందని పలువురు చెప్పారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Orphan Kidinamma

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News