స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పుట్టపర్తిలో పీజీఆర్ఎస్ రద్దు

- జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల నిబంధనావళి (ఎలక్షన్ కోడ్) అమలులో ఉన్నందున, పుట్టపర్తిలో నిర్వహించే ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం పీజీఆర్ఎస్ ను రద్దు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు తెలిపారు.
ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ పీజీఆర్ఎస్ రద్దు నిర్ణయం అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయి, ఎన్నికల కోడ్ ఉపసంహరించుకున్న తర్వాత తిరిగి పీజీఆర్ఎస్ యథావిధిగా ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












