05/11/2026, Thursday · 08:33:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మడకశిరలో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ

భవ్య జర్నలిస్ట్ 29/10/2026 9:42 PM శ్రీ సత్యసాయి 21

మడకశిరలో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ
Want this news as a newspaper clip?Print News Clip
  • నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు...

నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గురువారం సాయంత్రం మడకశిర పట్టణంతో పాటు శివపురం వడ్రపాలెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎస్పీ గారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఎన్నికల విధుల నిర్వహణ, పోలీసు బందోబస్తు, ఇతర శాఖలతో సమన్వయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకునేలా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
 స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామగ్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం లేదా ఓటు హక్కు వినియోగానికి ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రౌడీషీటర్లు, గతంలో ఘర్షణలకు పాల్పడినవారు, ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.
పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో , ఆర్డిఓ నాగప్రసన్న లక్ష్మి , మున్సిపల్ కమిషనర్ మురళీధర్ ,మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ, శ్రీనివాసులు, సీఐలు శివరాముడు, రాజ్‌కుమార్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఎన్నికల సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

మడకశిరలో పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ

strong roomCheckpollingstationscountingcentresMadakasira

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News