05/11/2026, Thursday · 08:33:17 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కొత్తచెర్వులో ZPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, JC

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 5:12 PM శ్రీ సత్యసాయి 7

కొత్తచెర్వులో ZPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, JC
Want this news as a newspaper clip?Print News Clip

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెర్వు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నామినేషన్ల దాఖలు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేలా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, లైటింగ్, మైక్ సిస్టమ్ తదితర మౌలిక సదుపాయాలు పక్కాగా ఉండాలని ఆదేశించారు.

ఎన్నికల నిబంధనలను ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన నామినేషన్ పత్రాలను సమగ్రంగా పరిశీలించి, భద్రపరచాలని సూచించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసి, తగినంత పోలీస్ బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Code of Conduct) అమలులో ఎలాంటి అజాగ్రత్త వహించవద్దని హెచ్చరించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

కొత్తచెర్వులో ZPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, JC

Receipt CentresDistrictCollectorinspectsZPTCElectionNominationNewCheruvu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News