పుట్టపర్తి MPDO కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన

పుట్టపర్తి :ఎల్లుండి జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ పుట్టపర్తి MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మంగళవారం పరిశీలించారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు కావలసిన అన్ని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్లు, ఇంక్ మరియు ఇతర నిబంధనావళి సామగ్రి పంపిణీ ప్రక్రియ వేగవంతంగా, ఎలాంటి అయోమయం లేకుండా సాగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సిబ్బందికి అవసరమైన రవాణా సదుపాయాలు, భోజన వసతి, తాగునీరు మరియు వైద్య సహాయం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ఎన్నికలు పూర్తి పారదర్శక వాతావరణంలో జరిగేలా చూడాలని, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












