05/11/2026, Thursday · 08:33:18 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పెనుకొండ మున్సిపల్ చైర్మన్‌తో పాటు 23 వార్డులను కూటమి కైవసం చేసుకుంటాం

భవ్య జర్నలిస్ట్ 23/10/2026 9:00 PM శ్రీ సత్యసాయి 8

పెనుకొండ మున్సిపల్ చైర్మన్‌తో పాటు 23 వార్డులను  కూటమి కైవసం చేసుకుంటాం
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రజల్లోకి అభివృద్ధిని తీసుకెళ్తున్నాం: మంత్రి సవిత
  • పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి సవిత

పెనుకొండ మున్సిపాలిటీలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండ మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు మొత్తం 23 వార్డులను కూటమి కైవసం చేసుకుంటుమని ధీమా వ్యక్తం చేశారు. పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు అందిస్తారని మంత్రి సవిత పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే పనుల వివరాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ పొజిషన్ పట్టాలు అందించామని వెల్లడించారు.గత ప్రభుత్వం లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రివేంద్ర అన్న గతంలో ప్రత్యర్థుల చేతిలో ఎదురైన రాజకీయ పరిణామాలను ఆమె ప్రస్తావించారు.
రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు చెప్పుకుంటూ ఆధ్యాత్మిక ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని ప్రస్తుత ప్రత్యర్థిపై మంత్రి సవిత విమర్శలు చేశారు. రాముడు దేవాలయాల ధ్వంసానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీతో చేరడాన్ని ఆమె తప్పుబట్టారు.పెనుకొండ మున్సిపాలిటీలో ఇప్పటికే చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల మద్దతుతో మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Municipal ChairmanalliancewinwardsalongPenukonda

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News