పుట్టపర్తి పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో“వాక్ విత్ ప్రైడ్” కార్యక్రమం

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ..
డీఎస్పీ మాణిక్యరావు పర్యవేక్షణలో, పట్టణ సిఐ యువరాజు సూచనల మేరకు ఎస్సై శోభారాణి,
పుట్టపర్తి పట్టణంలో ఆదివారం సాయంత్రం “వాక్ విత్ ప్రైడ్” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్సై మరియు పోలీసు సిబ్బందితో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి గణేష్ గేట్, సత్తెమ్మ గుడి వరకు నడక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజల్లో భద్రతా భావనను పెంపొందించడం, పోలీసుల పట్ల ప్రజలకు మరింత నమ్మకాన్ని కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రజలు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
ఎన్నికల నిబంధనలు తప్పకుండా అందరూ పాటించాలని సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎస్సై తెలిపారు
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












