05/11/2026, Thursday · 08:34:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పాతపట్నం జనసేనలో క్షుద్రపూజల కలకలం!

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 11:19 AM శ్రీకాకుళం 10

పాతపట్నం జనసేనలో క్షుద్రపూజల కలకలం!
Want this news as a newspaper clip?Print News Clip

శ్రీకాకుళం: రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు.. ఇరు పక్షాల నాయకుల విమర్శల దాడి.. ఆడియో టేపుల లీకులు.. ఆఖరికి క్షుద్ర పూజలు. పాతపట్నంలో జనసేన పరిస్థితి ఇది. పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలు కొరికాన రవికుమార్, భవానీ ఫ్యామిలీ, గేదెల చైతన్య వర్గాల మధ్య చాన్నాళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు రచ్చకెక్కింది. ప్రస్తుత సుడా చైర్మన్‌ కొరికాన రవికుమార్, ఆయన సతీమణి భవానీ జనసేనలోకి రావడానికి కారణమైన గేదెల చైతన్యతో వారికి కాలక్రమేణా గ్యాప్‌ వచ్చింది. దీని వెనక ఆర్థిక పరమైన లావాదేవీలే కారణమని వాదనలు ఉన్నాయి. రానురాను రవికుమార్‌ ప్రాబల్యం పెరగడం కూడా ఈ భేదాలకు ఆజ్యం పోసింది.

గ్రూపు రాజకీయాలు.. క్షుద్రపూజలు

రాజకీయ విభేదాల నేపథ్యంలో రెండు వర్గాల వారు ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నారు. ఈ క్రమంలో కొరికాన రవికుమార్‌ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. అయితే రవికుమార్‌పై జనసేన నేతలే కొందరు క్షుద్ర పూజలు చేశారనే సమాచారం ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లింది. రవికుమార్‌ ఆస్పత్రిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో ఆయన సతీమణి భవానీకి కొందరు ఫోన్‌ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. ఇదంతా పార్టీలో ప్రత్యర్థుల పని అని భావించారు. దీంతో వారి మధ్య వివాదం మరింత రాజుకుంది.

ఆడియో కాల్స్‌ లీకుల పర్వం

ఇరువర్గాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్న సమయంలో జనసేన పార్టీ కార్మిక విభాగం నాయకుడు కింతాడ సంతోష్‌ అనే వ్యక్తి గేదెల చైతన్యకు ఫోన్‌ చేసి ఎమ్మెల్యేతో కుమ్మక్కయ్యావని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారని ప్రశ్నించారు. ఆ సమయంలో తనను చంపేస్తానని బెదిరించాడని ఆ ఆడియో రికార్డును సంతోష్‌ లీక్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌కి, నాగబాబుకి ఆ ఆడియో రికార్డును పంపించారు. కానీ, అక్కడ నుంచి స్పందన రాకపోవడంతో గేదెల చైతన్య లక్ష్యంగా సంతోష్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి జరిగిందంతా బయటపెట్టారు. దీని వెనక కొరికాన రవికుమార్, భవానీ దంపతులు ఉన్నారని గేదెల చైతన్య వర్గం అభిప్రాయపడుతోంది.

మరో ఆడియో..

ఒక ఆడియో వివాదం సద్దుమణగక మునుపే కొరికాన భవానీ ఓ జనసేన కార్యకర్తకు ఫోన్‌ చేసి, మాట్లాడిన ఆడియో కాల్‌ రికార్డు బయటకొచ్చింది. అందులో క్షుద్రపూజల ఉదంతం, తమకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలపై గట్టిగా మాట్లాడారు. ‘ఒక్కొక్కరి సంగతి తేలుస్తా. కౌంట్‌ డౌన్‌ స్టార్టయింది నేనేంటే చూపిస్తాన’ంటూ పరుష పదజాలంతో సంభాషించారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Jana SenaTroublesoldtown

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News