05/11/2026, Thursday · 08:03:00 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. భారత్ ఘన విజయం

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 5:20 PM క్రీడలు 16

న్యూజిలాండ్‌తో తొలి టీ20.. భారత్ ఘన విజయం
Want this news as a newspaper clip?Print News Clip
  • న్యూజిలాండ్‌తో ఉత్కంఠ భరింతగా సాగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
  • 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించి ఘన విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. 40 బంతుల్లో 82 పరుగులతో గ్లెన్ ఫిలిప్స్ జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. 45 పరుగులతో ఫిన్ అలెన్ కూడా జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్ బెవోన్ జేకబ్స్ కూడా 31 పరుగులతో రాణించాడు. దీంతో, న్యూజిలాండ్ 225 పరుగులు సాధించింది.అనంతరం బరిలోకి దిగిన భారత కూడా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అభిషేక్ శర్మ (12 బంతుల్లో 29; 2 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సంజూ శాంసన్ మరోసారి తన సత్తా చూపించాడు. 33 బంతుల్లో 67 పరుగులతో (8 ఫోర్లు, 4 సిక్సులు) జట్టుకు కీలకంగా మారాడు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 42 పరుగులు) జట్టును విజయతీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. కివీ బౌలర్లు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా తట్టుకుని నిలబడ్డ భారత బ్యాటర్లు విజయాన్ని అందుకున్నారు. చివరి ఓవర్లలో మిచెల్ స్టాంట్నర్, మైఖేల్ బ్రేస్ వెల్ కీలక వికెట్ల తీయడంతో ఒకనానొక దశలో భారత్ కష్టాల్లో పడ్డట్టు అనిపించినప్పటికీ మళ్లీ కోలుకుని విజయాన్ని అందుకుంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

T20I winIndiaZealand

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News