05/11/2026, Thursday · 08:03:03 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 11:34 AM క్రీడలు 11

రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు నో ప్లేస్.. రహానె ఆల్‌టైమ్ భారత టెస్టు జట్టు ఇదే!
Want this news as a newspaper clip?Print News Clip

భారత మాజీ క్రికెటర్‌ అజింక్య రహానె తన ఆల్‌టైమ్‌ భారత టెస్టు జట్టును ప్రకటించి క్రికెట్‌ వర్గాల్లో చర్చకు తెరలేపాడు. ఈ జట్టులో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, యార్కర్ల కింగ్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చోటు కల్పించలేదు. అంతేకాదు.. తనకు తానే తుది జట్టులో స్థానం ఇచ్చుకున్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను నాలుగో స్థానంలో ఎంపిక చేసిన రహానె.. ఎంఎస్‌ ధోనికి జట్టు పగ్గాలు అప్పగించాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్‌లో కలిసి ఆడిన ఆటగాళ్లలో అత్యుత్తమ భారత టెస్టు జట్టును ఎంపిక చేయాలని కోరగా తన జట్టును వెల్లడించాడు.రహానె తన ఆల్‌టైమ్‌ జట్టులో ఓపెనర్లుగా మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌లను ఎంచుకున్నాడు. మూడో స్థానంలో టీమిండియా మాజీ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌కు అవకాశం కల్పించాడు. నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లీకి బదులుగా సచిన్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేశాడు. ఐదో స్థానాన్ని తనకే కేటాయించుకున్నాడు. ఆరో స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేయడంతో పాటు జట్టు కెప్టెన్సీ బాధ్యతలూ అతడికే అప్పగించాడు. గత దశాబ్ద కాలంగా భారత టెస్టు జట్టులో కీలక పాత్ర పోషించిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు రహానె తన జట్టులో చోటివ్వకపోవడం ఆసక్తికరంగా మారింది.
బౌలింగ్‌ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన జస్‌ప్రీత్‌ బుమ్రాకు చోటు దక్కలేదు. అతడి స్థానంలో మహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌లను ఎంపిక చేశాడు. విదేశీ గడ్డపై భారత టెస్టు జట్టు విజయాల్లో ఈ ముగ్గురు పేసర్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. స్పిన్‌ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు చోటు కల్పించాడు.
రహానె ఆల్‌టైమ్‌ భారత టెస్టు జట్టు ఇదే:
మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌, అజింక్య రహానె, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Test teamplaceRohitKohliBumrahRahanetimeIndian

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News