05/11/2026, Thursday · 08:34:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష..

భవ్య జర్నలిస్ట్ 01/11/2026 3:45 PM రాష్ట్ర వార్తలు 17

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష..
Want this news as a newspaper clip?Print News Clip
  • ఆర్నబ్ తుఫాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోకముందే మరో తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. ఏపీకి మరో తుఫాన్ ప్రమాదం పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. దీనిపై ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆర్నబ్ తుఫాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోకముందే మరో తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. ఏపీకి మరో తుఫాన్ ప్రమాదం పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. దీనిపై ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు, రేపటి ఢిల్లీ పర్యటనను కూడా ఆయన రద్దు చేసుకున్నారు. సమీక్ష సందర్భంగా అర్నాబ్, రాబోయే తుఫాన్ ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావం, వర్షాలు, గాలుల అంచనాలు, జలాశయాల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాబోయే ప్రమాదం గురించి సీఎంకు అధికారులు కీలక వివరాలు వెల్లడించారు.వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. అనంతరం తుఫాన్‌గా మారి నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వివరించారు. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని చెప్పారు. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో 9 మండలాలు, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒక మండలంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసినట్లు వివరించారు. నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీమీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్లు ఉండవచ్చని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. నవంబరు 3న బుడమేరుకు సుమారు 32,500 క్యూసెక్కుల వరద ప్రవాహం రావచ్చని, ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర వాగుల్లో భారీ వరదకు అవకాశం ఉందని వెల్లడించారు.
బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆర్నబ్బ్ తుఫాన్ నష్టం, సహాయక చర్యలపైనా సీఎంకు అధికారులు కీలక విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్నబ్బ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపై చంద్రబాబు ఆరా తీశారు. ఈరోజు రాత్రికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు ఆయనకు తెలిపారు.
అలాగే, తుఫాన్ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే తరలించాలని, వరద ప్రభావిత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు. తుఫాన్ సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

urgently reviewscyclonethreatChandrababu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News