ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం

అమరావతి, : ఆర్నబ్ తుఫాన్ కారణంగా ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) పరిధిలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. 156 (33/11 కేవీ) సబ్స్టేషన్లు, 576 (11 కేవీ) ఫీడర్లకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 93 సబ్స్టేషన్లు, 324 (11 కేవీ) ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. మరోవైపు 685 గ్రామాలు, 2,64,999 గృహ, వాణిజ్య (నాన్-అగ్రి) విద్యుత్ కనెక్షన్లకూ అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన అధికారులు 474 గ్రామాల్లో, 1,42,130 సర్వీసులను పునరుద్ధరించారు. మిగిలిన 1,22,869 సర్వీసులకు మరమ్మతులు కొనసాగుతున్నాయి.కాగా కృష్ణా జిల్లాలో అత్యధికంగా 560 గ్రామాలు, 94 సబ్స్టేషన్లు, 357 (11 కేవీ) ఫీడర్లపై తుఫాను ప్రభావం పడింది. దీని కారణంగా విద్యుత్ శాఖకు దాదాపు రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఏపీసీపీడీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం 1995 మంది సిబ్బందితో కూడిన 399 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తుఫాన్ కారణంగా 30,878 వ్యవసాయ (ఏజీఎల్) సర్వీసులకు అంతరాయం కలిగిందని చెప్పారు. వాటిలో 14,343 సర్వీసులను పునరుద్ధరించామని తెలిపారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












