05/11/2026, Thursday · 08:58:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్‌ షాకు ఫోన్‌లో వివరించిన చంద్రబాబు

భవ్య జర్నలిస్ట్ 28/10/2026 2:59 PM రాష్ట్ర వార్తలు 15

ఆర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్‌ షాకు ఫోన్‌లో వివరించిన చంద్రబాబు
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి,: రాష్ట్రంపై ఆర్నబ్ తుఫాన్ భీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడి వివరించారు. ప్రభావిత జిల్లాలైన విశాఖ, కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రికి తెలియజేశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 70 వేల పైచిలుకు హెక్టార్లలో పంట నీటమునిగినట్టు తెలిపారు. 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలతో పాటు ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు.తుఫాన్ ప్రభావంతో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా తీసుకున్న ముందస్తు చర్యల గురించి అమిత్ షాకు సీఎం వివరించారు. ముంపు ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించినట్టు ఫోన్‌లో తెలియజేశారు. ప్రాథమికంగా నష్టం అంచనాలను కేంద్రానికి పంపుతున్నామని.. కేంద్ర బృందాలను కూడా రాష్ట్రానికి పంపాలని కోరారు. కేంద్రం నుంచి సాయం అందేలా చూడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో వినతి చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Chandrababu explainedAmitShahphonedamagecausedCycloneArnab

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News