05/11/2026, Thursday · 09:02:45 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ముంబైలో సౌండ్ లేకుండా హెడ్‌ఫోన్స్‌తో దుర్గమ్మ నిమజ్జనం.. వీడియో వైరల్

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 11:27 AM రాష్ట్ర వార్తలు 4

ముంబైలో సౌండ్ లేకుండా హెడ్‌ఫోన్స్‌తో దుర్గమ్మ నిమజ్జనం.. వీడియో వైరల్
Want this news as a newspaper clip?Print News Clip

పండుగలంటేనే సందడి.. ఊరేగింపులంటే డీజే పాటలు, భారీ స్పీకర్ల హోరు గుర్తుకొస్తాయి. కాకపోతే.. డీజే సౌండ్స్ వల్ల శబ్దకాలుష్యం పెరిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఎలాంటి సౌండ్ లేకుండానే దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని నిర్వహిస్తూ ముంబైలో ఓ వినూత్న ట్రెండ్‌ను పరిచయం చేశారు. సాధారణ డీజేలకు భిన్నంగా ‘సైలెంట్ డీజే’ విధానంలో సాగిన ఈ ఊరేగింపులో భక్తులు.. యువత వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు ధరించి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బయటకు ఎలాంటి భారీ సంగీత శబ్దాలు వినిపించకపోయినా.. హెడ్‌ఫోన్ల ద్వారా పాటలు వింటూ నిమజ్జన వేడుకను కొనసాగించారు. ఈ వినూత్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డీజే మోతకు బదులు హెడ్‌ఫోన్లు.. శబ్ద కాలుష్యానికి చెక్..

నిమజ్జన శోభాయాత్రల్లో భారీ స్పీకర్లు.. డీజే పాటల కారణంగా పరిసర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు అధిక శబ్దంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సైలెంట్ డీజే విధానం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ప్రత్యేక హెడ్‌ఫోన్ల ద్వారా మాత్రమే సంగీతం వినిపించేలా ఏర్పాటు చేయడంతో, వేడుకల్లో పాల్గొనేవారు పాటలను ఆస్వాదిస్తూనే బయట శబ్దాన్ని తగ్గించవచ్చు. పండుగ సంబరాలకు భారీ శబ్దాలే అవసరం లేదని చాటిచెప్పే ఈ ప్రయోగం పర్యావరణహిత వేడుకలపై చర్చకు దారితీస్తోంది. సంప్రదాయాలకు విఘాతం కలగకుండా.. ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఉత్సవాలు నిర్వహించవచ్చనే సందేశాన్ని ఈ సైలెంట్ డీజే కార్యక్రమం అందిస్తోంది.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Durgamma immersionheadphonessoundMumbaigoesviral

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News