05/11/2026, Thursday · 08:34:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 10:12 AM రాష్ట్ర వార్తలు 15

ఎర్రన్నాయుడు ఆశయాలే నా మార్గం.. ప్రజాసేవే నా లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి : కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 14వ వర్ధంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. ఉత్తరాంధ్ర గుండెచప్పుడు, తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన ప్రజానాయకుడు ఎర్రన్నాయుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై.. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి జీవితాంతం కృషి చేసిన నాయకుడు ఎర్రన్న అని అన్నారు. చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడిగా, రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచిన ధీశాలి అని చెప్పుకొచ్చారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని గుర్తుచేశారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన ప్రజానాయకుడు ఎర్రన్నాయుడు అని మంత్రి తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ గళాన్ని బలంగా వినిపించి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటారన్నారు. పదవుల కంటే ప్రజలకే ప్రాధాన్యమిస్తూ.. కార్యకర్తలకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. ‘ఎర్రన్నాయుడు నాకు అన్నయ్య మాత్రమే కాదు.. రాజకీయ గురువు, మార్గదర్శి.. నా రాజకీయ ఎదుగుదలకు పునాది వేసిన వ్యక్తి. భౌతికంగా దూరమై 14 ఏళ్లు గడిచినా మా అన్నయ్య జ్ఞాపకాలు సజీవమే.. ఆయన ఆశయాలే నా మార్గం, ప్రజాసేవే నా లక్ష్యం’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Public serviceErnnayuduAsayyawaygoalMinisterAtchannaidu

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News