ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలి: మంత్రి అచ్చెన్నాయుడు

ర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పంటల సంరక్షణపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుడి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, కోసిన ధాన్యం, నిల్వలు దెబ్బతినకుండా రైతులను అప్రమత్తం చేయాలని తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని మంత్రి ఆదేశించారు.నీటమునిగిన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించాలని మంత్రి తెలిపారు. తుఫాన్ అనంతరం పంటల పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని రైతులకు అందించాలన్నారు. గ్రామాలవారీగా, పంటలవారీగా, రైతులవారీగా నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని వెల్లడించారు. అర్హులైన ప్రతి రైతుకూ ప్రభుత్వ సహాయం సకాలంలో అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రైతులకు భరోసా కల్పించడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












