05/11/2026, Thursday · 09:02:34 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

భవ్య జర్నలిస్ట్ 25/10/2026 8:30 PM రాష్ట్ర వార్తలు 7

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
Want this news as a newspaper clip?Print News Clip

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉన్నందున రాష్ట్రంపై పడే ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కోనసీమ– యానాం– కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై గాలులు, వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది.తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు, కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 27 వ తేది ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఉండే అవకాశం కనిపిస్తున్నది. 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను ప్రమాద ప్రాంతాల్లో తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్‌ పునరుద్ధరణ అంశాల్లో సన్నద్ధం గా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Storm ContinuingExtremelySevereCyclonicBayBengal

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News