05/11/2026, Thursday · 08:34:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

హైకోర్ట్_లో_కూటమి_ప్రభుత్వానికి_ఎదురుదెబ్బ

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 3:53 PM రాష్ట్ర వార్తలు 15

హైకోర్ట్_లో_కూటమి_ప్రభుత్వానికి_ఎదురుదెబ్బ
Want this news as a newspaper clip?Print News Clip

#షెడ్యూల్డ్_ఏరియా గ్రామాలలో #ఆదివాసీలకు కేటాయించవలసిన సర్పంచి మరియు వార్డు మెంబర్ సీట్లను ఇతరులకు మళ్ళించారని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన శ్రీకాకుళానికి చెందిన సవర చొక్కా రావు, వెస్ట్ గోదావరి చెందిన మడకం వెంకటేశ్వర్లు తదితరులు*

ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది #జడ_శ్రవణ్_కుమార్

ఈ నెలలో జరగనున్న సర్పంచి ఎన్నికలలో గిరిజన ప్రాంత అభ్యర్ధులకే కేటాయించాల్సిన సీట్లను ఇతరులకు మళ్ళించారు అన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్

 👇👇👇👇👇👇

GO.MS No: 154, Dt 12.10.2026 క్లాజ్ 4(1), 4(2)(b), 7(1) ప్రకారం పూర్తి స్తాయిలో గిరిజన ప్రాంత అభ్యర్ధులకు కేటాయించాల్సిన సీట్లను ఇతరులకు మళ్ళించారు అన్న న్యాయవాది జడ శ్రవణ్

👇👇👇👇👇👇

ఈ చట్టం ప్రకారం 6748 గ్రామ సర్పంచులను ఆదివాసీలకు కేటాయించాలి అన్న న్యాయవాది జడ శ్రవణ్

నవంబర్ 26న జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ లలో కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు తీరని అన్యాయం చేసింది అన్న న్యాయవాది జడ శ్రవణ్

 ❗❗❗❗❗❗

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని షెడ్యూల్డ్ ఏరియా లోని 6748 గిరిజన ప్రాంత గ్రామాలను సర్పంచ్ లుగా గిరిజనేతరులకు మళ్లించే పనిలో కూటమి ప్రభుత్వం

ఇప్పటికే ZPTC, MPTC ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయిన గిరిజన ప్రాంత నివాసితులకు సర్పంచ్ ఎన్నికలలో సైతం అన్యాయం చేస్తుంది అన్న న్యాయవాది 🔹జడ శ్రావణ్.

 ✊✊✊✊✊✊

ఈ నెలలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా రిజర్వేషన్ ఖరారు చేసే ముందు పిటిషనర్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలన్న అన్న హైకోర్టు

రాజ్యాంగం ప్రకారం తమకు కేటాయించిన రిజర్వేషన్ తమకు మాత్రమే చందాలీ అంటూ పిటిషనర్ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని చట్టం ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ జరగాలి అన్న హైకోర్టు

షెడ్యూల్ ఏరియా లో ఉన్న ఆర్డీవోలు తక్షణమే పిటిషనర్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ ప్రక్రియ అమలు పరచాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశం

ఈనెల 17వ తారీఖున పిటిషనర్ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని 9 జిల్లాల ఆర్డీవోలు జిఓ ఎంఎస్ నెంబర్ 154 కనుగుణంగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అన్న హైకోర్టు

ఇది ఆదివాసీల అతిపెద్ద విజయంగా అభివర్ణించిన పిటిషనర్లు

చరిత్రలో మొట్టమొదటిసారిగా 7వేలకు పైగా ఆదివాసీలకు సర్పంచ్ పదవులు కేటాయించబడతాయి అన్న పిటిషనర్ సరవ చొక్కారావు మరియు మడకం వెంకటేశ్వర్లు

షెడ్యూల్ ఏరియాలో ఉన్న ప్రతి వార్డు మెంబర్ తో సహా సర్పంచి ఆదివాసి గానే ఉంటారు

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

prabhutvaniki edurudebbahaikortkutami

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News