05/11/2026, Thursday · 09:02:25 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడా?

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 11:14 AM రాష్ట్ర వార్తలు 10

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడా?
Want this news as a newspaper clip?Print News Clip

ఏపీ ట్రాన్స్‌కోలో చీపురుపల్లి ఏఈగా విధులు నిర్వర్తిస్తున్న లలిత కుమారి రోడ్డు పక్కన విగతజీవిగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందనే వార్త రాజాం పరిసరాల్ని చుట్టుముట్టేసింది. తొలుత అందరూ రోడ్డు ప్రమాదంగానే భావించినా..పోలీసుల రాకతో సీన్‌ మారింది. ఆమె హత్యకు గురైనట్లు ప్రాథమిక ఆధారాల్ని సేకరించిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, మృతురాలి బంధువులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

చీపురుపల్లిలో విద్యుత్‌శాఖలో ఏఈగా పని చేస్తున్న సలాది లలిత కుమారి (43) రాజాం పట్టణ శివార్లలోని కొండంపేటలో భర్త సీతారామరాజు, పిల్లలు యువరాజు, మధురతో నివాసం ఉంటున్నారు. భర్త గుడివాడ సీతారామరాజు (రాజు) రాజాంలో ఫుట్‌వేర్‌ షాపు నడుపుతున్నాడు. లలిత ప్రతి రోజూ మాదిరిగానే ఆదివారం ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో యోగా క్లాస్‌కు తన ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. కొద్దిసేపటి తరువాత మార్గమధ్యంలో శ్మశాన వాటిక వద్ద రోడ్డు పక్కన లలిత మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే దగ్గరకు చేరుకుని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లలిత పడి ఉన్న ప్రాంతాన్ని సమీపంలో పడి ఉన్న ద్విచక్రవాహనంపై ఆరా తీశారు. తొలుత రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. లోతుగా పరిశీలించిన అనంతరం హత్యగా నిర్ధారించారు.

ఆధారాల సేకరణ

స్థానికులు సైతం లలితది రోడ్డు ప్రమాదంగా భావించి బోరుమన్నారు. ఇంతలోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదానికి భిన్నంగా ఇక్కడి పరిస్థితులు ఉండడంతో అనుమానాస్పద మృతి కోణంలో ఆధారాలు సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె వాడిన వాహనం ఎక్కడా దెబ్బ తినకపోవడం.. మృతురాలి ఒంటిపై ప్రమాద ఘటనకు సంబంధించిన గాయాలు లేకపోవడం, తలపై బలమైనా ఆయుధంతో దాడి చేసినట్లు గుర్తించి క్లూస్‌ టీంకు సమాచార మిచ్చారు. వారి ఆధారాల సేకరణతో పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పోలీసు జాగిలం హత్య జరిగిన ప్రదేశం నుంచి నేరుగా మృతురాలి భర్త వద్దకు వెళ్లి ఆగడంతో పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

అనుమానంతోనే హత్య..

తమ కుమార్తె చీపురుపల్లిలో విద్యుత్‌ శాఖలో జేఈగా పనిచేస్తుంది. ఉద్యోగ రీత్యా బయటకు వెళ్లినప్పుడు తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు తన అల్లుడు అనుమానిస్తుండేవాడని, దీంతో భార్యభర్తల మధ్య తరచూగా గొడవలు జరుగుతున్నాయని.. అనుమానంతో తమ బిడ్డను అల్లుడు తరచూ వేధించేవాడని ఈ దుస్థితికి ఆయనే కారణమై ఉండొచ్చని మృతురాలి మృతురాలి తల్లిదండ్రులు విశ్రాంత రైల్వే ఉద్యోగి సలాది నాగేశ్వరరావు, తల్లి నిర్మల మీడియాకు వివరించారు. దోషుల్ని పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు.

ప్రమాదం కాదు..

ఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు పరిశీలించారు. ఇది రోడ్డు ప్రమాద ఘటన కాదని.. హత్య ఘటన కోణంలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మృతురాలి భర్తపై అనుమానాలు వెల్లడించారు. రాజాం టౌన్‌ సీఐ నవీన్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారని, అమె భర్తతోపాటు వెనుక ఎవరెవరు ఉన్నారే కోణంలో పరిశీలన జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

become timelessgirded

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News