05/11/2026, Thursday · 09:02:46 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

చంద్రబాబు అధికారంలో ఉంటే రాజ్యాంగ వ్యవస్థలకు ఆటంకం..

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 11:40 AM రాష్ట్ర వార్తలు 9

చంద్రబాబు అధికారంలో ఉంటే రాజ్యాంగ వ్యవస్థలకు ఆటంకం..
Want this news as a newspaper clip?Print News Clip
  • వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన
  • స్థాని­క ఎన్నికల్లో నామినేషన్‌ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలంటూ సు­ప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామ­ని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ రాజ్యాంగ వ్యవస్థలను స్వతంత్రంగా, సక్రమంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలు కొనసాగుతున్నాయనడానికి సుప్రీంకోర్టు ఆదేశాలే నిదర్శనమన్నారు. ఈ కేసులో వాస్తవాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఎన్ని­కల çకమిషన్‌ కూడా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితులు లేవని ధర్మాన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పాలకులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఒక ప్రాంతంలో ఎన్నికలు ప్రక్రియ సజావుగా నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే దానికి కేవలం ఎన్నికల సమస్యగా కాకుండా రాష్ట్రంలో వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయన్న కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

constitutional systemsChandrababupowerhindrance

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News