ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పారితోషికం పెంపు..

- స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పారితోషికం పెంచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పారితోషికం పెంచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కేటగిరీల వారీగా గతంలో ఉన్న పారితోషికంలో మార్పులు చేస్తూ జీవో జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి వివిధ కారణాలతో ప్రమాదం సంభవిస్తే ఇచ్చే పరిహారంలోనూ మార్పులు చేసింది. ఈ మేరకు జీవో నంబర్ - 1345,1346లను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ జారీ చేశారు
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












