స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే జగన్ అజెండా: ఎమ్మెల్యే బొండా ఉమా

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు ఆరోపించారు. అందుకే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, నగరిలో రోజా అరాచకాలు సృష్టించారన్నారు. ఎన్నికలను అడ్డుకోవడానికే గొడ్డలి పార్టీ 59 కేసులు పెట్టిందని నిందించారు. నంద్యాలలో కౌన్సిలర్ అభ్యర్థిగా నాగమణి సంతకాలు పెట్టి విత్‌డ్రా చేసుకుంటే దానిని వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.2014 మున్సిపల్ ఎన్నికల్లో కేవలం1 శాతం మాత్రమే ఏకగ్రీవాలు జరిగితే.. 2021లో జగన్ దౌర్జన్యాలు చేసి 21 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. సొంత బాబాయిని చంపి రక్తచరిత్రను రాయించిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. వైసీపీకి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ కూడా గల్లంతవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలను ఎగ్గొట్టిన జగన్ పార్టీ.. 2029 ఎన్నికల్లో భూస్థాపితం అవుతుందని ఎమ్మెల్యే బొండా పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












