05/11/2026, Thursday · 09:02:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పవన్ కల్యాణ్ రాజీనామా ప్రచారంపై జనసేన ఫైర్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు

భవ్య జర్నలిస్ట్ 22/10/2026 10:25 AM రాష్ట్ర వార్తలు 4

పవన్ కల్యాణ్ రాజీనామా ప్రచారంపై జనసేన ఫైర్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు
Want this news as a newspaper clip?Print News Clip

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛానల్.. పెడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసేన నేతలు, డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించారు. ఆ అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ, త్వరలో ఒక కీలకమైన వార్త రాబోతోందంటూ విష ప్రచారం చేయడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందంటూ మెసేజ్ తిప్పుతున్న వైనం ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెసేజ్ సర్క్యూలేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.వైసీపీ నేతలే వెనకుండి ఈ విష ప్రచారాన్ని చేస్తున్నారంటూ జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారం చేసేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని‌ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Police ComplaintJanaSenaFireCyberPawanKalyanResignation

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News