05/11/2026, Thursday · 08:03:01 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు..

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 9:15 PM రాష్ట్ర వార్తలు 14

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు..
Want this news as a newspaper clip?Print News Clip
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. మురసు తుఫాన్ ప్రభావంతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. సోమ, మంగళవారాల్లో నడవాల్సిన తొమ్మిది రైళ్ల సర్వీసులను నిలిపివేసింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. మురసు తుఫాన్ ప్రభావంతో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. సోమ, మంగళవారాల్లో నడవాల్సిన తొమ్మిది రైళ్ల సర్వీసులను నిలిపివేసింది.వీటిలో విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ, గుంటూరు-తెనాలి, తెనాలి-గుంటూరు రైళ్లు ఉన్నాయి. అలాగే, సోమవారం నడవాల్సిన తెనాలి-రేపల్లె రైలు సర్వీసును కూడా రద్దు చేశారు. మరోవైపు, మంగళవారం నడవాల్సిన రేపల్లె-మార్కాపురం రోడ్, మార్కాపురం రోడ్-రేపల్లె రైలు సర్వీసులనూ రద్దు చేశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Effect CancellationMursuCycloneseveraltrainsVijayawadaDivision

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News