05/11/2026, Thursday · 09:02:42 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

భవ్య జర్నలిస్ట్ 21/10/2026 8:12 PM రాష్ట్ర వార్తలు 4

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
Want this news as a newspaper clip?Print News Clip
  • భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
  • అక్టోబర్ 26వ తేదీన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 26వ తేదీన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఇన్‌చార్జ్‌గా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జె. శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పర్యటనలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు స్వాగతం, వీడ్కోలు పలికే బాధ్యతలు మంత్రి సత్యకుమార్‌కు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఉప రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ వివరాలు..

అక్టోబర్ 26వ తేదీ ఉదయం10.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి చేరుకుంటారు.

ముందుగా అంబేడ్కర్‌ కళావేదిక, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్మృతివనాన్ని ఆయన సందర్శిస్తారు.

ఉదయం 11 నుంచి 12.10 గంటల వరకు ఎన్టీఆర్‌ హెల్త్ వర్సిటీ వేడుకల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు.

ఆ రోజు రాత్రి తిరుపతిలోనే ఆయన బస చేస్తారు.

అక్టోబర్ 27వ తేదీ ఉదయం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి దర్శించుకుంటారు.

అనంతరం ఉదయం 8.15 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Vice PresidentNTRHealthUniversityAnniversaryCelebrationsChiefGuest

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News