ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి సభ్యుడిగా(న్యాయ విభాగం) సీనియర్ న్యాయవాది అంచా పాండురంగారావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో సీఎస్ సాయిప్రసాద్ ఈఆర్సీ సభ్యుడిగా పాండురంగారావుతో ప్రమాణస్వీకారం చేయించారు.