05/11/2026, Thursday · 09:02:40 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

భవ్య జర్నలిస్ట్ 27/10/2026 1:04 PM రాష్ట్ర వార్తలు 12

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
Want this news as a newspaper clip?Print News Clip

 ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు (మంగళవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.మూడు జిల్లాల్లో 24 గంటల పాటు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, అపరాల పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని.. కల్లాల్లోని ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అరటి, బొప్పాయి, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని.. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పశుగ్రాసం, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అత్యవసర సహాయక పరికరాలను సిద్ధంగా ఉంచాలని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ తగ్గిన వెంటనే గ్రామాలవారీగా పంట, ఆస్తినష్టం అంచనాలు చేపట్టాలని.. రైతులకు అధికారులు, సిబ్బంది అండగా నిలవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

mamtri achchennayuduprananashtamjaragakumdachudaliarnabtuphanpai

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News