05/11/2026, Thursday · 09:02:41 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ప్రొ. కోదండరాంకి అంబేద్కర్ సూర్యుడు అవార్డును ప్రదానం చేసిన ఎంపీ తిరుమావళన్

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 10:31 PM రాష్ట్ర వార్తలు 5

ప్రొ. కోదండరాంకి అంబేద్కర్ సూర్యుడు అవార్డును ప్రదానం చేసిన ఎంపీ తిరుమావళన్
Want this news as a newspaper clip?Print News Clip

వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ. కోదండరాంకి అంబేద్కర్ సూర్యుడు అవార్డును ఈరోజు బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో VCK పార్టీ జాతీయ అధ్యక్షులు, తమిళనాడు చిదంబరం లోక్ సభ ఎంపీ తిరుమావళన్ తన చేతుల మీదుగా ప్రధానం చేసారు.

ఈ సందర్భంగా ఎంపీ తిరుమావళన్ మాట్లాడుతూ.. మానవ, పౌర హక్కుల ఉద్యమాలతో పాటు, అంబేద్కర్ ప్రతిపాదించిన చిన్న రాష్ట్రాల భావనను గౌరవిస్తూ, సమైక్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో ప్రొ. కోదండరాం గారు చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సలీమ్ పాషా, పార్టీ కార్యాలయ ఇంఛార్జి హనుమంత్ రెడ్డి, టీజేఏస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం. నర్సయ్య, టీజేఏస్ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జస్వంత్ కుమార్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తుల్జా రెడ్డి, టీజేఏస్ నాయకులు జైపాల్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Surya AwardProfThirumavalanconferredKodandarankiAmbedkar

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News