విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

నవంబర్ 1న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది.. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ 29, 30 తేదీల్లో బ్యాలెట్ పద్దతిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు విజయవాడ కలెక్టర్ లక్ష్మీశ ఆ జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.నవంబర్ ఒకటో తేదీన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే డైరెక్షన్స్‌ని వాళ్లకి తెలియచేస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ప్రాపర్‌గా ప్రిపేర్ అవుతున్నాం. సెన్సిటివ్, క్రిటికల్ గ్రామాలను ముందుగానే గుర్తించాము. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశాం. ప్రతి ఊర్లో బందోబస్తును ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకోండి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ద్వారా మీకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకోండి’ అని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












