ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్

- 56.89 శాతం ఓటింగ్ నమోదు
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వార్డుల్లో సోమవారం నిర్వహించిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.సాయంత్రం 5:00 గంటల సమయానికి అందిన అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 56.89 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ మరియు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ వెల్లడించారు.
ఈ నాలుగు వార్డుల పరిధిలో మొత్తం 3,039 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,729 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్డుల వారీగా పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి
1వ వార్డు (పోలింగ్ స్టేషన్ నం. 1/1) మొత్తం ఓటర్లు 929 కాగా,608 ఓట్లు పోలయ్యాయి (65.45 శాతం).3వ వార్డు (పోలింగ్ స్టేషన్ నం.3/1): మొత్తం ఓటర్లు 638 కాగా,354 ఓట్లు పోలయ్యాయి (55.49 శాతం).7వ వార్డు (పోలింగ్ స్టేషన్ నం.7/1) మొత్తం ఓటర్లు 750 కాగా,356 ఓట్లు పోలయ్యాయి (47.47 శాతం).8వ వార్డు (పోలింగ్ స్టేషన్ నం. 8/1) మొత్తం ఓటర్లు 722 కాగా,411 ఓట్లు పోలయ్యాయి (56.93 శాతం).అత్యధికంగా 1వ వార్డులో 65.45 శాతం, అత్యల్పంగా 7వ వార్డులో 47.47 శాతం ఓటింగ్ నమోదైంది.పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే












