05/11/2026, Thursday · 09:02:31 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

బయటకొచ్చిన షర్మిళ కుమార్తె అంజలి రెడ్డి వివాహ ఆహ్వన పత్రిక.

భవ్య జర్నలిస్ట్ 24/10/2026 10:10 PM రాష్ట్ర వార్తలు 7

బయటకొచ్చిన షర్మిళ కుమార్తె అంజలి రెడ్డి వివాహ ఆహ్వన పత్రిక.
Want this news as a newspaper clip?Print News Clip
  • యలహంక ప్యాలెస్ లో మేనకోడలి పెళ్లికి జగన్ అభ్యంతరాలపై కొనసాగుతున్న చర్చ
  • ప్యాలెస్ ప్రాంగణంలో పెళ్లి వద్దంటూ జగన్ రాసిన లేఖకు ఘాటుగా సమాధానం పంపిన షర్మిల బంధువులు

బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో నవంబర్ 25 వ తేదీ షర్మిలా రెడ్డి కుమార్తె అంజలీ రెడ్డి పెళ్లి

ఆహ్వాన పత్రికలో యలహంక ప్యాలెస్ ను వేదికగా పేర్కొని బంధువులను ఆహ్వానించిన షర్మిలా రెడ్డి

* ఆహ్వాన పత్రిక బయకు రావడంతో జగన్ తీరుపై మళ్లీ చర్చ.

* షర్మిలా రెడ్డి బంధువులతో పాటు వియ్యంకుల బంధువులకూ ఇప్పటికే పెళ్లి కార్డుల పంపిణీ.

* యలహంక ప్యాలెస్ ప్రాగణంలో షర్మిలా రెడ్డి గృహంలో పెళ్లి నిశ్చయం చేసి ఆహ్వానం.

* అయితే జగన్ అభ్యంతరాలతో యలహంక ఇంట్లో పెళ్లి వేడుక చేయలేని పరిస్థితి..

* దీనిపై అభ్యంతరాలు చెపుతూ ఇప్పటికే షర్మిలకు జగన్ లేఖ.

జగన్ చెప్పిన అభ్యంతరాలు తోసిపుచ్చుతూ కౌంటర్ పంపిన షర్మిలా రెడ్డి బంధువులు

పెళ్లి చేసుకుంటే భద్రతా పరమైన ఇబ్బందులు వస్తాయన్న వాదనపై మండిపాటు

* ఉమ్మడి ఆస్తిలో పెళ్లి వేడుకుకు అడ్డుపడడంపై తీవ్ర అసంతృప్తి.

* మేనమామగా ముందుండి పెళ్లి చేయాల్సిన జగన్.... మేనకోడలి పెళ్లికి ఆటంకాలు కల్పించడంపై ఆగ్రహం.

జగన్ కు ఇచ్చిన కౌంటర్ లో కుటుంబ సభ్యులు లేవనెత్తిన అంశాలు:

* నిజంగా జగన్ భద్రతకు ఇబ్బంది అయితే రెండు రోజులు ప్యాలెస్ దూరంగా ఉండవచ్చు కదా అంటున్న షర్మిల బంధువులు.

* రాజశేఖర్రెడ్డి ఆనాటి ఫ్యాక్షన్ రాజకీయ పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులకు, బంధువుల పిల్లలకు పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయలేదా అని ప్రశ్నిస్తూ జగన్ కు కౌంటర్.

* ప్రాణహాని ఉందని భయపడే జగన్ .. ఆనాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పపోరాటాలు చేశారా?

* ఆనాడు ప్రతిపక్షనేతగా , ముఖ్యమంత్రిగా నాటు బాంబులు, కత్తులతో ప్రాణాపాయం ఉందని తెలిసినా కుటుంబంలో అందరి పెళ్లిళ్లు చేయలేదా ?

* శత్రువులను సైతం నాడు వైఎస్ ఆర్ పెళ్లిళ్లకు ఆహ్వానాలు పంపలేదా ? అని ప్రశ్న

* వైఎస్ తమ్ముళ్ల పిల్లలు, తోడపుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్ ఇంట్లో జరగలేదా

* తమ్ముడు జార్జ్ రెడ్డి అనిల్ రెడ్డి పెళ్లి , విమలమ్మ కొడుకు యువరాజ్ పెళ్లి , కూతురూ దివ్య పెళ్లి , బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు రఘుదీప్ పెళ్లి , తమ్ముడు వైఎస్ సుధీకర్ రెడ్డి కుమార్తె విరోనికా రెడ్డి పెళ్లిళ్లు వైఎస్ ఇళ్లలోనే జరిగాయి కదా?

* నీలా పెళ్లిళ్లను అడ్డుపెట్టుకుని ప్రాణహాని ఉందని ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి దాక్కోలేదు కదా ?

* షర్మిలా రెడ్డి కి కాబోయే వియ్యంకులు ఇప్పటికే వెడ్డింగ్ కార్డులో షర్మిల రెసిడెన్సీ, బెంగళూరు లో వివాహం అని కార్డులు ముద్రించి వారి కుటుంబ సభ్యులకు పంచుకున్నది కనిపించడం లేదా ?

* సెక్యూరిటీ పేరుతో కాబోయే వియ్యంకుల ముందు షర్మిల పరువు తీయాలని చూడటం ఎంతవరకు సమంజసం ?

* అత్యంత సన్నిహితులను ఆహ్వానించిన పెళ్లి వేడుకకు అడ్డు చెప్పడంపై వైఎస్ కుటుంబంలో విస్తృత చర్చ.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

బయటకొచ్చిన షర్మిళ కుమార్తె అంజలి రెడ్డి వివాహ ఆహ్వన పత్రిక.

Anjali ReddySharmiladaughterweddinginvitation

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News