05/11/2026, Thursday · 08:34:48 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

జగన్ చేసిన పని దేశ చరిత్రలో ఇదే తొలిసారి: ఎమ్మెల్సీ వర్ల రామయ్య

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 5:54 PM రాష్ట్ర వార్తలు 18

జగన్ చేసిన పని దేశ చరిత్రలో ఇదే తొలిసారి: ఎమ్మెల్సీ వర్ల రామయ్య
Want this news as a newspaper clip?Print News Clip
  • వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన జగన్.. ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన జగన్.. ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారని మండిపడ్డారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఇలా ఓటింగ్‌ను బహిష్కరించడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని వర్ల పేర్కొన్నారు.ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై జగన్ ప్రశ్నలు లేవనెత్తడాన్ని వర్ల ప్రస్తావించారు. బెయిల్‌పై ఉన్న దస్తగిరి ఎన్నికల వేళ బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించిన జగన్.. తానూ 14 ఏళ్లుగా షరతులతో కూడిన బెయిల్‌పైనే ఉన్నారనే విషయాన్ని గ్రహించాలని చురకలు అంటించారు. జగన్‌పై రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి సంబంధించి 12 సీబీఐ ఛార్జిషీట్లు ఉన్నాయని, అయినా బెయిల్‌పై ఉండి ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. పులివెందులలో తన పిన్ని ఓడిపోతున్నారనే మానసిక వేదనతోనే జగన్ నిన్న ఆ విధంగా ప్రవర్తిస్తూ ఆరోపణలు చేశారని అన్నారు. పులివెందులలో జరిగిన ఘటనలపై సీరియస్ యాక్షన్ తీసుకోలేదని ఫిర్యాదు చేసినట్లు వర్ల తెలిపారు.
మరోవైపు, మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ నేతలు, కార్యకర్తలు అరాచకం సృష్టించారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఫ్యాన్ పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు దుర్మార్గమని అన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనీ ఎమ్మెల్సీ ఆరోపించారు. అవినాశ్ స్థానికంగా ఓటరు, అభ్యర్థి కాదని, అయినా ఆయన పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించారని చెప్పారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు దేవినేని అవినాశ్‌పైనా ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Varla RamaiahtimehistorycountryworkJaganMLC

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News