05/11/2026, Thursday · 08:34:44 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

భవ్య జర్నలిస్ట్ 02/11/2026 10:03 AM రాష్ట్ర వార్తలు 17

ఏపీకి మురసు తుఫాన్ ముప్పు.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి: ఏపీకి మురసు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు.. తీవ్ర తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైకి 260 కిమీ, నెల్లూరుకు 290 కిమీ, మ‌చిలీప‌ట్నానికి 320 కిమీ, కావలికి 310 కిమీ, ఒంగోలుకు 330 కిమీ , విశాఖ‌ప‌ట్నానికి 470కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.మురసు తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. రాయలసీమలోని నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

heavy rainfallThreatthunderstorms

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News