05/11/2026, Thursday · 08:58:36 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

తుఫాన్‌ వేళ.. ‘మనమిత్ర’ భరోసా!

భవ్య జర్నలిస్ట్ 31/10/2026 9:51 AM రాష్ట్ర వార్తలు 17

తుఫాన్‌ వేళ.. ‘మనమిత్ర’ భరోసా!
Want this news as a newspaper clip?Print News Clip

బాధితులకు అండగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ 1500లకు పైగా సమస్యలను ప్రభుత్వానికి షేర్‌ చేసిన ప్రజలు
యుద్ధప్రాతిపదికన పరిష్కరించిన యంత్రాంగం అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం వేళ ‘మనమిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ బాధితులకు కొండంత భరోసాగా నిలిచింది. తమకు ఎదురైన సమస్యలను, ఇబ్బందులను బాధితులు తక్షణం అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సేవలను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. తమ ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయని, చెట్లు కూలాయని, విద్యుత్‌ పునరుద్ధరించాలని, ఆహారం అందించాలని, మందులు కావాలని, ఇతరత్రా దాదాపు 1500కు పైగా పలు రకాల సమస్యలను ప్రభుత్వానికి షేర్‌ చేశారు. ఈ క్రమంలో వాటిపై ఆర్టీజీఎస్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి పంపించడం ద్వారా.. వచ్చిన సమస్యను వచ్చినట్లే యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. బాధితులకు అత్యవసర సాయం అందించారు.
95 శాతానికిపైగా పరిష్కారం: తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను ‘మనమిత్ర’ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు, ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై స్పందించిన రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు ‘మనమిత్ర’లో ఆ సదుపాయాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో తుఫాన్‌ ప్రభావిత ప్రజలు శుక్రవారం సాయంత్రానికి 1500లకు పైగా సమస్యలను మనమిత్ర ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటిల్లో 95 శాతంపైగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించారు. కాగా, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101కు ప్రజలు పెద్దఎత్తున ఫోన్లు చేసి అత్యవసర సహాయం కోరారు. ఆ సమస్యలను కూడా అధికారులు తక్షణం పరిష్కరించారు. ఈ నెంబర్లకు 741 కాల్స్‌ వచ్చాయి.

ఇదీ చదవండి :: ఉమ్మడి అనంత మున్సిపాలిటీలన్నీ కూటమికే

Manamitra reassuranceThunderstorm

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

740 Posts

Latest News